![]() |
![]() |

శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ప్రోమోలో ఒక సెగ్మెంట్ గాయని జానకమ్మ గారికి నివాళి అర్పిస్తూ ఆమె పాడిన పాటల్లోని కొన్నిటిని ఆలపించారు. ఇక ఈ ఎపిసోడ్ కి కొరియోగ్రాఫర్ రఘు మాష్టర్ అతని వైఫ్ సింగర్ ప్రణవి వచ్చారు. ఆమె పాటలు వింటున్నంత సేపు ప్రణవి కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నారు. "అందరూ ఎంతో అభిమానంతో అమ్మ అని పిలుస్తారు ఆమెను అన్నాడు ప్రదీప్. ఇంతలో ప్రణవి లేచి "చాల ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని అన్నం కలిపి పెట్టి లేదు పాడాలి అనేవారు . బాలు గారిని తీసుకెళ్లిపోయాడు , ఇప్పుడు అమ్మను తీసుకెళ్లిపోయారు. ఎం చేయాలో తెలీదు " అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ఇక ప్రోమో స్టార్టింగ్ లో రఘు మాష్టర్ , ప్రణవి ఇద్దరూ డ్రెస్సింగ్ విషయంలో గొడవ పడ్డారు. జెన్ జిల రెడీ అవ్వమంటే 90 స్ లా ఉంటానంటావేంటి అని రఘు అనేటప్పుడు ఆది, నరేష్ వచ్చారు. వాళ్ళ గొడవ విని ఇది నాకెందుకు ఇంతకు "శేఖర్ మాష్టర్ కి జానీ మాష్టర్ కి ఏంటి " అని ఆది అడిగేసరికి " ఓరి బాబు " అంటూ దణ్ణం పెట్టాడు రఘు మాష్టర్. ఎంతైనా జెన్ జిల రెడీ అవ్వడానికి ట్రై చెయ్యి. హెయిర్ స్టైల్ చేంజ్ చేసుకుంటే జెన్ జిల అవుతావని చెప్పా కదా అంటూ ప్రణవి మీద రఘు మాష్టర్ ప్రెజర్ పెట్టేసరికి "నీకంటే బానే ఉన్నానులే " అంటూ ప్రణవి రివర్స్ డైలాగ్ వేసేసరికి రఘు మాష్టర్ షాకైపోయాడు.
ఇంతలో ప్రదీప్ వచ్చి "అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తోంది. కొండల మీద నుంచి తోసేస్తున్నారు. డ్రమ్ములు, కుక్కర్లు అబ్బో చాలా రేంజ్ అనేసరికి సరే మీ రేంజ్ ఏంటో ట్రై చేయండి ఇంకా అన్నాడు ప్రదీప్. దాంతో రఘు మాష్టర్ షాకై అలా ఉండిపోయాడు. ఇక ఆది "సరే వెళ్ళరా చూసుకుందాం 90 స్ లేదా జెన్ జి " నా అని అన్నాడు. "మా 90 స్ లో భర్తలకు సేవలు చేసేవాళ్ళు. వాళ్ళు భర్తల్ని శవాలను చేస్తున్నారు. ఏమంటివి ఏమంటివి మా 90 స్ జాతి నీచమా. ఎంత మాట ఎంత మాట. ఒక చేతిలో టైర్ పట్టుకుని ఒక చేతిలో కర్ర పట్టుకుని వీధిలో ఆడుకుంటూ పడిపోతే మళ్ళీ ఉమ్ము రాసుకుని మళ్ళీ పరిగెత్తే జాతి మా 90 స్ జాతి. అరేయ్ అప్పట్లో పిజ్జాలు బర్గర్లు లేకపోయినా చెట్టుకున్న కాయను రాయితో కొట్టి దానికే ఉప్పు కారం అద్దుకుని తిన్న జాతిరా మా 90 స్ జాతి. " అంటూ పెద్ద డైలాగ్ చెప్పాడు ఆది.
![]() |
![]() |